VKB: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా లవ కుమార్, పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోర్టు ఆవరణలో న్యాయవాదులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తామన్నారు.