MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి, వారికి విలువైన సూచనలు చేశారు.