MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై శిబిరం ప్రారంభించారు. పశువులకు గర్భకోశ, సాధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. డాక్టర్ లక్ష్మి, క్లబ్ అధ్యక్షులు రవీందర్ గుప్తా, శ్రీనివాస్, కార్యదర్శులు జానకిరామ్, నాగరాజు పాల్గొన్నారు.