RR: ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదని నందిగామ మాజీ వార్డు సభ్యులు సతీష్ అన్నారు. వార్డులో అండర్ డ్రైనేజీ జామ్ కావడంతో దుర్వాసన వెదజల్లుతుంది. పరిస్థితిని గమనించిన సతీష్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుని పిలిపించి మురుగు కాలువను శుభ్రం చేయించారు. పదవిలేకున్నా ప్రజాసేవ చేయడంతో ప్రతి కాలనీలో ఇలాంటి ప్రజాసేవకుడు ఉండాలని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.