KNR: జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం కింద పిల్లలు లేని ఒక దంపతులకు వారి రక్త సంబంధీకుల నుంచి ఓ పాపను జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా చట్టబద్ధంగా దత్తత ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దత్తత ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. దత్తత ప్రక్రియ చట్టపరంగా పూర్తి కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.