MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ 1, 2వ వార్డులో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుధ్య పనులను ఛైర్ పర్సన్ పరిశీలించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామన్నారు.