MDK: రామాయంపేట బాలుర ఉన్నతపాఠశాల హెచ్ఎం నాగమణిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ మెదక్ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మౌలిక వసతులు, విద్యా కిట్లు అందించాలని.. పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. లేదంటే ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ విద్యాశాఖ పర్యవేక్షకులకు వినతిపత్రం సమర్పించారు.