NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. హైదరాబాద్ శిల్పారామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయనకు అవార్డును అందజేశారు. ప్రోత్సాహకంగా రూ. 10,000 నగదు బహుమతిని ఇచ్చారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, అధ్యాపక సంఘాలు, సహచరులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.