BHPL: జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం వల్ల పత్తి పంట రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో రెండు రోజులు వర్షం కొనసాగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు.