PDPL: రెండు పడక గదుల ఇండ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన పనులు మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలోని కూనారం రోడ్డు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు. మౌలిక వసతుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.