WGL: యాసంగి పంట సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా రూ.75,95,40,280 రైతు భరోసా నిధులు సోమవారం సాయంత్రం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. మొదటి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 1,55,169 మంది రైతులకు ఈ సాయం అందించినట్లు వివరించారు. వ్యవసాయ అవసరాలకు భరోసా నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.