NGKL: వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరిట వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మవద్దని నాగర్‌కర్నూలు జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రజలను హెచ్చరించారు. రోజుకు 5,000 సంపాదనంటూ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ముందస్తుగా డబ్బులు కట్టవద్దని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.