ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. బ్యూటీషియన్ కోర్సులో ఈనెల 11 నుంచి 35 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. 19-45 వయసు మహిళలు SSC, ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ పత్రాలు, 3 ఫొటోలతో ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.