GDWL: అలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు ఘనంగా ముగిశాయి. 14 జతల ఎద్దులు పాల్గొన్న ఈ పోటీల్లో కర్నూలుకు చెందిన దొడ్డి హనుమంతు ప్రథమ బహుమతి సాధించారు. అనంతపురం గోవిందు ద్వితీయ, గుంటూరు శ్రీనివాస్ చౌదరి తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.