KMR: బాన్సువాడ మండలం తిరుమలపూర్ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల దోమకొండలో జిల్లా స్థాయి జరిగిన పోటీలలో పాఠశాలకు చెందిన సుమిత్ర, అశ్విని పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.