JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రావాలని ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.