GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్లు గోదాంలో నిల్వ ఉంచిన సీఎంఆర్ వడ్లు దాదాపు 300 బస్తాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై సాయి గోపాల్ ఇంటెక్ ప్లాంట్ యజమాని హరినాథ్ ఇటిక్యాల పీఎస్లో ఈనెల 25న ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇటిక్యాల పోలీసులు గోదాంను సందర్శించి పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.