NZB: బోధన్‌లోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.