HYD మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీల విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉండే మహేంద్ర అనే యువకుడు బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.