KMM: పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని సీపీ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.