MDK: మెదక్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈనెల 27 లోగా సమర్పించాలని సూచించారు.