HYD: నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ గురువారం సికింద్రాబాద్ వాయుశక్తి నగర్లో 224గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయి పెరుగుతుందని అధికారులు గుర్తించారు.