AKP: కోటవురట్లలో HPV వ్యాక్సిన్ కు 213 మంది అర్హులు ఉన్నట్లు PHC వైద్యాధికారిణి డాక్టర్ ధనలక్ష్మి తెలిపారు. కె.వెంకటాపురం పీహెచ్సీలో 15 ఏళ్లు వయసుగల 20 మంది బాలికలకు గురువారం వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.