SRPT: గణపతి నవరాత్రుల సందర్భంగా సూర్యాపేటలో 37 వార్డు గౌడ్స్ బజార్లో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం లడ్డు శుక్రవారం రాపర్తి రాములు గౌడ్ రూ.1,01,000కు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. రాపర్తి రాములు గౌడ్, మాట్లాడుతూ.. గణపతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డును దక్కించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.