సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం రాత్రి పలు మండపాలలో నెలకొల్పిన దుర్గ మాత అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో దుర్గ మాత ఆశీస్సులతో సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆశీర్వదించారు.