KNR: చొప్పదండి మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మండల విద్యాధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన జి.జ్యోతిని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలు విద్యా విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉత్కం వేణుగోపాల్, పాల్గొన్నారు.