ఉమ్మడి వరంగల్ జిల్లాలో 511 పంచాయతీలకు, 3,793 వార్డులకు కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సుల్లో సర్పంచ్ ఓట్లు వేరు చేసి, వార్డుల వారీగా లెక్కిస్తున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ ఫలితాలు పూర్తి చేయబడతాయి. అనంతరం ఉప సర్పంచ్ ఫలితాలు కూడా ప్రకటించవచ్చు. రాత్రి 9 గంటలలోపు అన్ని పంచాయతీల్లో కౌంటింగ్ ముగుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.