JN: లింగాల ఘనపూర్ మండలం నవాబ్ పేట పశు సంతను ఫిలిప్పీన్స్ డాక్టర్లు ఫ్రాన్సిస్, లోవెల్లు శుక్రవారం పరిశీలించారు. పశువుల నిర్వహణ పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పశు వ్యాధుల నియంత్రణ, రవాణా విధానాలపై సమాచారం సేకరించారు. ఈ పర్యటనలో ఆపెడా ఈజీఎం అఫ్జల్ అజీజ్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా.మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.