నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 15,173 విద్యార్థులు 34 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. 300 ఇన్విజిలేటర్లు, CC కెమెరాలు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్స్, 6 కస్టోడియన్స్ 34 మెడికల్ ANMలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ల QR కోడ్ ద్వారా కేంద్ర వివరాలు తెలుసుకోవచ్చు.