PDPL: రోడ్డు భద్రతా మాసొత్సవాల సందర్భంగా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో బుధవారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన ఆటోల ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.