HYD: తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో ఉదయం కారు ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ వైపు నుంచి తార్నాక వెళ్లేదారిలో డివైడర్ వద్ద ఉన్న చెట్టును అదుపు తప్పిన కారు ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న తోటి ప్రయాణికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.