JGL: విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. వేసవి సెలవుల్లో బాల బాలికల కోసం మాధవ సేవా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 10 వరకు గీత విద్యాలయం ఆవరణలో నిర్వహించిన సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.