HYD: GHMC పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు BRS నాయకులతో నేడు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారు. నగరంలోని BRS సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.