BDK: నేడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సిబ్బంది, మహిళా ఉద్యోగులతో క్యాంటీన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆత్మస్థైర్యానికి, ఆర్థిక స్వాలంబనకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు.