WGL: గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ పరిధిలోని శాంతినగర్లో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభమయ్యాయి. స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి, త్వరగా పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు. డివిజన్లో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కార్పొరేటర్ కోరారు.