ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. వారం క్రితం 30 గుడ్ల కేసు రూ.220కి విక్రయమవుతుండగా, ప్రస్తుతం రూ.130కి చేరుకుంది. ఫారాల వద్ద హోల్సేల్ ధర నేడు రూ.125కే ఉందని వ్యాపారులు తెలిపారు. దీంతో రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.8 నుంచి రూ.6కి తగ్గింది. అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పాత ధరలకే విక్రయిస్తున్నట్లు సమాచారం.