NGKL: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకాంక్షించారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు నెలవంక దర్శనమివ్వడంతో రేపు పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ముస్లిందరికీ ఈ పండుగ సుఖసంతోషాలను ఇవ్వాలని ఆయన కోరారు.