KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో శుక్రవారం టీజీవీపీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ 137 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ మండల అధ్యక్షుడు దేవుని భరత్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ విజయ్, సభ్యులు నితిన్, సాయి తదితరులు పాల్గొన్నారు.