SRD: ధరణికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నిజాంపేటలో భూభారతి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టంతో రైతులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.