NLG: తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. గురువారం దేవరకొండలో మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారతదేశం, పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం నీచమైన చర్య అని మండిపడ్డారు.