NZB: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఇసుక అవసరమైన వినియోగదారులు మన ఇసుక వాహనం యాప్ ద్వార ఆన్లైన్లో బుక్ చేసుకుని పొందాలన్నారు.