SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని తరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలేత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.