నిర్మల్: ఆధ్యాత్మిక మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీమన్న జాతరలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమన్న దేవునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.