MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో పత్తిని కనీస మద్దతు ధర రూ.8110తో కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు లింక్ చేసి, కప్పాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేయాలని కోరారు.