SDPT: ఐనాపూర్‌కు చెందిన కర్రోళ్ల బిక్షపతి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ సాధించారు. వృక్షశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ పి.కమలాకర్ పర్యవేక్షణలో ‘అకాలిఫా మలబారికా’ మొక్కపై పరిశోధన చేసి పీహెచ్ఎ పొందారు. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రుల కష్టమే తన విజయానికి పునాది అని బిక్షపతి తెలిపారు. SI తోట మహేశ్‌కుమార్, సర్పంచ్ కళ్యాణి కృష్ణ తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు.