BHNG: రాజపేట మండలం నెమిల గ్రామంలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో మంగళవారం గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నర్సింహులు ఇంట్లో రూ.10 వేలు, సమ్మయ్య ఇంట్లో తులంన్నర బంగారం, తులం వెండితో పాటు రూ.4 వేల నగదును అపహరించారు. అలాగే రాములు ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు. ఎస్సై లింగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.