కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ ఈ ఏడాది ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలోని విద్యార్థులకు ఇంకా కొత్త యూనిఫామ్లు అందలేదు. దీంతో పాత యూనిఫామ్లతోనే విద్యార్థులు తరగతులకు హాజరుకావల్సి ఉందన్నారు. సరఫరా ప్రక్రియ వేగవంతం చేసి త్వరలోనే పంపిణీ చేపడతామని అధికారులు తెలిపారు.