NZB: గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాలని కమిషనర్ సాయి ఛైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.