KNR: గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ముల్కనూర్ గ్రామ పంచాయతీ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌ను కేవలం రెండు రూపాయలకే అందించే కార్యక్రమాన్ని సర్పంచ్ సాంబారి భారతమ్మ నిన్న ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు త్రాగునీరు అందజేయడం దీని ఉద్దేశ్యం అన్నారు.