మేడ్చల్: మాధవి హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు గురుమూర్తిని కోర్టుకు తరలించారు. భార్య మాధవిని చంపిన కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.